Chegodilu | చెకోడీలు
Allrecipeshere Facebook8 Google+0 Twitter0 Pinterest0 LinkedIn0 Chegodilu preparation in telugu | చెకోడీలు | ఆంధ్ర పిండి వంటలు ఎన్నిరకాల మిఠాయిలు తిన్నా, అప్పుడప్పుడు మన స్వదేశీ వంటకాలమీద మనసు పోతుంటుంది కదా. అందులోనూ కరకరలాడుతూ కారంగా, ఉప్పగా మరియు నోట్లో వేసుకుంటే కరిగిపోయే రుచికరమైన చెకోడీలు నచ్చనివారుండని మీకు తెలుసు అన్ని సమయంలో ప్రియమైన అల్పాహారంగా వాడుకోవచ్చు. జాగ్రత్తగా చేసి పెట్టుకుంటే దాదాపు వారం పదిరోజులు నిల్వ ఉంటాయి. ఇందుకు కావలసినవి బియ్యంపిండి ౧ కే‌జి - Rice flour 1 Kg పెసరపప్పు అర కే‌జి Moong dal / Green gram dal ½ Kg తినేసోడా ¼ టీ స్పూన్ Food soda ¼ tea spoon కారం ౧ టీ స్పూన్ - Chili powder 1 Tea spoon ఉప్పు తగినంత - Salt నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg తయారు చేయు విధానము Step 1 ముందుగా పెసర పప్పును ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలి. Step 2 ఆ తరువాత పెసర పప్పుని శుభ్రంగా కడిగి నీళ్లని వడ గట్టి తరువాత గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 రుబ్బుకున్న పెసరపప్పు పిండిలో బియ్యం పిండి, కారం, తినేసోడా మరియు వేడి చేసిన ఒక కప్పు నూనెను వేసి బాగా కలుపుకోవాలి. Step 4 తరువాత వేడి చేసిన నీళ్ళలో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని ముద్దలా కలుపుకొని అర గంట సేపు నానపెట్టుకోవాలి. Step 5 తరువాత చిన్న గోళీకాయంత పిండిని తీసుకొని దానిని అర చేతిలో వేసుకొని రెండవ చేతి వ్రేళ్ళతో పిండిని పుల్లలాగా సన్నగా, పొడవుగా చేసి ఆ చివర ఈ చివర కలిపి గుండ్రంగా రింగులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. Step 6 తరువాత బూర్లే మూకుడులో తగినంత నూనె వేసి అది కాగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉంగరాలని కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించుకుంటే చెకోడీలు సిద్ధం అయినట్టే. Step 7 గుర్తించండి : గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. Chegodilu | చెకోడీలు   Save Print Chegodilu preparation in telugu | చెకోడీలు | ఆంధ్ర పిండి వంటలు Author: E.Anand Rao Recipe type: Appetiser Cuisine: Indian Ingredients ఇందుకు కావలసినవి బియ్యంపిండి ౧ కే‌జి - Rice flour 1 Kg పెసరపప్పు అర కే‌జి Moong dal / Green gram dal ½ Kg తినేసోడా ¼ టీ స్పూన్ Food soda ¼ tea spoon కారం ౧ టీ స్పూన్ - Chili powder 1 Tea spoon ఉప్పు తగినంత - Salt నూనె ౧ కిలో - Refined Cooking Oil 1 Kg Instructions తయారు చేయు విధానము ముందుగా పెసర పప్పును ఒక గంట సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఆ తరువాత పెసర పప్పుని శుభ్రంగా కడిగి నీళ్లని వడ గట్టి తరువాత గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పెసరపప్పు పిండిలో బియ్యం పిండి, కారం, తినేసోడా మరియు వేడి చేసిన ఒక కప్పు నూనెను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వేడి చేసిన నీళ్ళలో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని ముద్దలా కలుపుకొని అర గంట సేపు నానపెట్టుకోవాలి. తరువాత చిన్న గోళీకాయంత పిండిని తీసుకొని దానిని అర చేతిలో వేసుకొని రెండవ చేతి వ్రేళ్ళతో పిండిని పుల్లలాగా సన్నగా, పొడవుగా చేసి ఆ చివర ఈ చివర కలిపి గుండ్రంగా రింగులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత బూర్లే మూకుడులో తగినంత నూనె వేసి అది కాగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉంగరాలని కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించుకుంటే చెకోడీలు సిద్ధం అయినట్టే. Notes గుర్తించండి : గాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. 3.2.2124